విశాల్ హీరోగా నటించి, తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మాణంలో సంస్థకు 99వ ప్రాజెక్టుగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ బృందం, తాజాగా జూన్ 11న అధికారికంగా టీజర్‌ను విడుదల చేసింది.
యాక్షన్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్లో ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు, హీరోయిన్ అంజలి సరికొత్త మాస్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దుషార విజయన్, తంబి రామయ్య, అర్జై ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు రవి అరసు అందించిన కథతో విశాల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అందిస్తుండగా, రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
