నాని సినిమాలో ‘డ్రాగన్’ బ్యూటీ.. కానీ..!

న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై మరో ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ‘దండోరా’ చిత్రంతో క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి రుక్మిణి వసంత్‌ను ఫిక్స్ చేశారట. అయితే, హీరో ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. హీరో ఎవరనేది ఖరారైన వెంటనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రస్తుతం దర్శకుడు మురళీకాంత్ స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతూ, మిగిలిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. అన్ని కుదిరితే ఈ చిత్రం ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version