వడ్డే నవీన్ పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై స్వయంగా వడ్డే నవీనే నిర్మిస్తున్న ఈ చిత్రంతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్లో వడ్డే నవీన్ ఎలాంటి అన్యాయాన్నైనా ఎదిరించే ఒక నిజాయితీ గల, పవర్ఫుల్ పోలీస్ కానిస్టేబుల్ ‘త్రిమూర్తులు’ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన సరసన రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు చక్కటి కామెడీ, ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత కూడా వడ్డే నవీన్ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, కళ్యాణ్ నాయక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. రఘుబాబు, శివన్నారాయణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను జూన్ 19న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
