మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. రీ-రిలీజ్ కానున్న ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. చిరంజీవి కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ కామెడీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రాన్ని మేకర్స్ రీ-రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ఆగస్టు 22, 2026న అత్యంత గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. కేదార్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను సరికొత్త 4K అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి తనదైన మేనరిజమ్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రంలో మెప్పించాడు. శ్రీకాంత్ ‘ఏటీఎం’ పాత్ర, సోనాలి బింద్రే నటనతో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఈ సినిమాను టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.

ఇప్పుడు మెగాస్టార్ పుట్టినరోజు నాడు ఈ చిత్రాన్ని సరికొత్త డిజిటల్ హంగులతో, 4K క్లారిటీతో థియేటర్లలో ప్రదర్శించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. శంకర్ దాదా-ఏటీఎంల కామెడీ, మాస్ డ్యాన్స్ నెంబర్లను మళ్లీ వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version