హీరో రుత్విక్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం జూలై 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథలో ఒక బలమైన పాయింట్ ఉందని, అదే తనను ఎంతగానో ఆకర్షించిందని హీరో రుత్విక్ తాజాగా పేర్కొన్నాడు.
వెండితెరపై ప్రేక్షకులు కూడా ఆ వెరైటీ ఎలిమెంట్‌ను చూసి ఖచ్చితంగా థ్రిల్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఇదొక రిఫ్రెషింగ్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, విజువల్‌గా ఈ చిత్రం చాలా రిచ్‌గా ఉండటమే కాకుండా అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలుస్తుందని రుత్విక్ తెలిపాడు.
మంచి అంచనాలతో వస్తున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూలై 17 నుండి థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
