అవెంజర్స్ డూమ్స్ డే ఫస్ట్ ట్రైలర్: అప్పుడే మొత్తం కావాలంటే ఎలా?

ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్నటువంటి కామిక్స్ మరియు సినిమా సంస్థల్లో మార్వెల్ సంస్థ సినిమాలు కూడా ఒకటి. వీటిలో ‘అవెంజర్స్’ అనే మల్టీవర్స్ సినిమాలకి ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంతా కాదు. ఇండియాలో కూడా భారీ ఎత్తున ఈ ఫ్రాంచైజ్ కి ఫాలోయింగ్ ఉంది.

ఇలా ఎండ్ గేమ్ సినిమాతో అంతా ముగిసింది అనుకునే సమయంలో మేకర్స్ అనౌన్స్ చేసిన ‘అవెంజర్స్ డూమ్స్ డే’ మళ్ళీ మార్వెల్ ఫ్యాన్స్ ని మేల్కొల్పింది. ముందు ఒకో కీలక పాత్రని పరిచయం చేస్తూ వీరు తిరిగొస్తున్నారని కన్ఫర్మ్ చేసి చిన్న చిన్న టీజర్ లతో మంచి హైప్ ని సెట్ చేశారు.

అలా లేటెస్ట్ గా విడుదల చేసిన మొదటి ట్రైలర్ సోషల్ మీడియాలో స్మాష్ హిట్ అయ్యింది. దీనితో ఇక్కడ నుంచి అసలు రచ్చ మొదలైంది. ఆల్రెడీ ఈ మొదటి ట్రైలర్ లోనే చాలా పాత్రలు, కంటెంట్ అందించేసారు మేకర్స్. కానీ ఇందులో కూడా ఇంకొందరిని చూపించలేదు అంటూ అప్పుడే ఆడియెన్స్ గోల కూడా స్టార్ట్ చేశారు.

స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ మార్వెల్ అలాగే అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఐరన్ మ్యాన్ తిరిగి వస్తాడా లేదా అనేవి సస్పెన్స్ గా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడే ఆశించేయడం అనేది చాలా తొందరపడడమే అని చెప్పాలి. ఇంకా చాలా సమయం ఉంది.. డెఫినెట్ గా మరో ట్రైలర్ కూడా ఉంటుంది. సో వాటిల్లో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచే అన్నీ కోరుకోవడం ఒకింత అతిగా అనిపిస్తుంది. సో కరెక్ట్ టైం వరకు ఆగి చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version