‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?

నాని హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై టాలీవుడ్‌లో సాలిడ్నె అంచనాలు నెలకొన్నాయి. వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ‘దసరా’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి.

​తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ‘ది ప్యారడైజ్’ మోస్ట్ అవేటెడ్ టీజర్‌ను ఆగష్టు 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో సిద్ధమైన ఈ టీజర్ నిడివి 1 నిమిషం 35 సెకన్లు ఉండనుండగా, టీజర్ విడుదలయ్యే ఖచ్చితమైన సమయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.

​ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను SLV సినిమాస్ నిర్మిస్తోంది. ఇందులో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Exit mobile version