తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య నడుస్తున్న విడాకుల వ్యవహారానికి తెరపడింది. విజయ్‌పై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంగీత అధికారికంగా వెల్లడించారు.
వర్చువల్ విధానంలో జరిగిన ఈ విచారణలో జడ్జి డి. సుజాత ఎదుట సంగీత హాజరయ్యారు. తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నానని, ఈ కేసును ఇకపై కొనసాగించబోనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు సైతం ఎలాంటి అభ్యంతరం లేదని తెలపడంతో, సంగీత విజ్ఞప్తిని అనుమతిస్తూ కోర్టు ఈ కేసును ముగించింది.
కోర్టులో పిటిషన్ ఉపసంహరణ
2026 ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధంలో తలెత్తిన మనస్పర్థలు, మానసిక వేదన కారణంగానే విడాకులు కోరుతున్నట్లు ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ లీగల్ పోరాటం కొనసాగడం తమిళనాడు రాజకీయాల్లో, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ వ్యవహారానికి ముగింపు పడింది.
