మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!

కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా మన టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కలయికలో చేస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం స్లమ్ డాగ్ కోసం అందరికీ తెలిసిందే. అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత అనుకున్న సమయాన్ని మించడంతో డిలే అవుతూ వచ్చింది.

ఇలా కొంత కాలం తర్వాత ఆడియెన్స్ రానున్న సినిమాల్లో ఇదొకటి కూడా ఉంది అనే విషయం కూడా గుర్తు లేనట్టు సైలెంట్ అయ్యిపోయారు మేకర్స్. కానీ ఫైనల్ గా మళ్ళీ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ గా సీనియర్ నటి టబు పై అప్డేట్ వచ్చింది.

ఆమెపై ఓ ఇంటెన్స్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఆమెని గౌరి హెగ్డేగా పరిచయం చేశారు. అలాగే ఆమె గ్లింప్స్ ని రేపు ఆగష్టు 10 ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. జేబీ మోషన్ పిక్చర్స్, ఛార్మి నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అతి త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version