అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం అమెరికాలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. అమెరికావ్యాప్తంగా 2,000కు పైగా స్క్రీన్‌లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చిత్ర అధికారిక పంపిణీదారు ప్రకటించారు. ఈ స్థాయి విడుదల కారణంగా, అమెరికాలో అత్యధిక స్క్రీన్‌లలో విడుదలయ్యే భారతీయ చిత్రాల్లో ‘టాక్సిక్’ ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు ఇంగ్లీష్‌తో సహా పలు భాషలలో విడుదల కానుంది.

కాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో యశ్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సురజిత్ గోపినాథ్‌తో పాటు అంతర్జాతీయ నటులు డారెల్ డి’సిల్వా, కైల్ పాల్, మరియు బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ నటిస్తున్నారు.

Exit mobile version