సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. మొదటి నుంచీ అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్ అంశమే ఇపుడు హైలైట్ గా నిలిచి మొదటి వీకెండ్ లో సాలిడ్ బుకింగ్స్ సహా వసూళ్లు రాబట్టేలా చేసింది. ఇక వీకెండ్ తర్వాత ఎంతో కీలకమైన సోమవారం పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందా అని అంతా గమనించారు.

అయితే దీనిని కూడా కొరియన్ కనకరాజు పాస్ అయ్యాడని చెప్పొచ్చు. కొరియన్ కనకరాజు చిత్రానికి గత 24 గంటల్లో ఆన్లైన్ బుకింగ్స్ లో 70 వేలకి పైగా టికెట్ సేల్స్ జరిగాయి. సో ఈ చిత్రం సోమవారం టెస్ట్ కూడా పాసయ్యింది అని చెప్పవచ్చు. ఇక ఈ కొన్ని రోజుల రన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version