మలయాళ సినిమా సీనియర్ స్టార్ హీరోస్ లో మోహన్ లాల్ కూడా ఒకరు. అయితే తన నట వారసులుగా కొడుకు, కూతురు ఇద్దరూ వెండితెర ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాదిలోనే ఓ సాలిడ్ హారర్ చిత్రం ‘డీయస్ ఈరే’ సినిమాతో కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ అలరించగా ఈ ఏడాదిలో కూతురు విస్మయ మోహన్ లాల్ ఓ యాక్షన్ సబ్జెక్టుతో డెబ్యూ ఇచ్చి మోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
విస్మయ మోహన్ లాల్ నటించిన ‘తుడక్కం’ చిత్రాన్ని దర్శకుడు జాడే ఆంథని జోసెఫ్ తెరకెక్కించగా ఓ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా వచ్చింది. అయితే కేరళ సహా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ వెళుతున్నట్టుగా తెలుస్తుంది.
ఒక్క కేరళ నుంచే 6 రోజుల్లో 15 కోట్లు వస్తే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 15 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తం 6 రోజుల్లో 30 కోట్లకి పైగా గ్రాస్ మోహన్ లాల్ కూతురు మొదటి సినిమాకే రావడం విశేషం. మరి రోజు రోజుకి వసూళ్లు పెంచుకుంటున్న ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎంతవరకు ప్రేక్షకులు వసూళ్లు అందిస్తారో చూడాలి.
