మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం ‘వారణాసి’ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న ఈ తొలి సినిమా కోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

అయితే ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ గ్లింప్స్ కి ఇచ్చిన స్కోరే ఇప్పటికీ ఓ రేంజ్ లో హై ఇస్తూ వస్తుంది. ఇక మొత్తం సినిమాకి తన వర్క్ ఎలా ఉంటుందా అని అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి ఆల్బమ్ పై తాను బిగ్ క్లారిటీ అందించారు.

మొత్తం 6 పాటలతో ‘వారణాసి’ ఆల్బమ్

ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో కీరవాణి కామెంట్స్ వైరల్ గా మారాయి. వారణాసి ఆల్బమ్ ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది అని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా వారణాసి ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయని ఖరారు చేశారు.

ఇంకా నాలుగే బ్యాలన్స్..

వారణాసి ఆల్బమ్ నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చేసిన సంగతి తెలిసిందే. రణ కుంభ అలాగే సంచారి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో ఇంకా నాలుగు పాటలు మాత్రమే బాకీ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి.

Exit mobile version