వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ టైటిల్ అధికారికంగా ఖరారైంది. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మార్క్ కామెడీ స్ఫూర్తితో రూపొందించిన ఓ సరదా ప్రమోషనల్ వీడియో ద్వారా చిత్ర బృందం ఈ సినిమా పేరును వెల్లడించింది. ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెడుతూ, ‘బావా బామ్మర్ది సౌజన్యంతో..’ అనే క్యాప్షన్‌ను జోడించారు.
టైటిల్ ప్రకటన కోసం విడుదల చేసిన ప్రత్యేక వీడియో వినోదాత్మకంగా సాగింది. వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని సినిమా పేరు అడగడం, ఆయన ప్రతిసారీ “జనవరి 12 విడుదల” అని సమాధానమివ్వడం నవ్విస్తుంది. చివరకు అదే సినిమా పేరు అని, రిలీజ్ డేట్ కూడా అదేనని స్పష్టం చేస్తూ టైటిల్‌ను ప్రకటించారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
