‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘రాకా’. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ తో ప్లాన్ చేయడానికి ముందే మరికొందరు బిగ్ స్టార్స్ వద్దకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

అప్పట్లోనే అట్లీ ఈ సినిమాలో వారితో పాటుగా పాపులర్ హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ని కూడా సినిమాలో పెడుతున్నాడని పలు రూమర్స్ వచ్చాయి. తర్వాత ఐకాన్ స్టార్ వద్దకి ఈ సినిమా వచ్చింది. ఇక ఇపుడు సీన్ కట్ చేస్తే ఈ కాంబినేషన్ లో మరోసారి ఆ రూమర్స్ మొదలయ్యాయి.

విల్ స్మిత్ రాకా లో జాయిన్ కానున్నట్టు రూమర్స్ ఓ రేంజ్ లో ఇప్పుడు చక్కర్లు కొట్టేస్తున్నాయి. అయితే అప్పుడూ ఇదే టాక్ వినిపించింది ఇప్పుడూ వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ నిజం అయితే మాత్రం హాలీవుడ్ ఎంట్రీకి టికెట్ దొరికేసినట్టే అనుకోవచ్చు. మరి అట్లీ అండ్ సన్ పిక్చర్స్ టీం ఏం ప్లాన్ చేసారో చూడాలి.

Exit mobile version