ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “ఇరుముడి” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత రవితేజ సరైన హిట్ కొట్టాలని టోటల్ టాలీవుడ్ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ శుక్రవారం రవితేజకి తనదయింది.

గత సినిమాలతో పోలిస్తే ఒక రోరింగ్ కంబ్యాక్ ని తాను అందుకున్నారని చెప్పొచ్చు. దీనికి నిదర్శనం మన దగ్గర జరుగుతున్న బుకింగ్స్ అనే చెప్పాలి. బుక్ మై షోలో ఈ సినిమాకి ఇప్పుడు గంటకి 31 వేలకి పైగా టికెట్స్ సేల్ పీక్ కి చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకి కూడా ఈ రేంజ్ బుకింగ్స్ కనిపించలేదు. అంతే కాకుండా రీజనల్ సినిమాల్లో అయితే ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. ఇది ఖచ్చితంగా రవితేజ పవర్ అనే చెప్పొచ్చు.

ఒక్క సరైన కంటెంట్ తో కూడిన సినిమా తనకి పడితే మరోసారి న్యూట్రల్ ఆడియెన్స్ అంతా తన సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారని నిరూపించింది ‘ఇరుముడి’. ఇక ఈ ట్రెండ్ లో సినిమా రికార్డ్ బుకింగ్స్ ఈరోజు నమోదు చేయడం గ్యారెంటీ. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version