బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. ఐతే, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రలో కనిపిస్తోందట. ఐతే, ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటిస్తోందని తెలుస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్ లో ఐశ్వర్య లక్ష్మి కూడా జాయిన్ అవుతుందట.

కాగా ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

Exit mobile version