NBK 111: బాలయ్య స్టైలిష్ లుక్ వైరల్!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో ఓ స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ ఏడాదిలోనే బాలయ్య ట్రీట్ ఉండొచ్చు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా సెట్స్ నుంచి బాలయ్య స్టైలిష్ ఊరమాస్ లుక్ ఒకటి వైరల్ గా మారింది. ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న బాలయ్య స్టైలిష్ డ్రెస్సింగ్ తో ఓ మాస్ ఫైట్ సీక్వెన్స్ లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనితో ఈ పిక్ గత కొన్ని గంటల నుంచి అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ సీరియస్ రోల్ లో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version