మన తెలుగు బుల్లితెర దగ్గర బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటి ‘బిగ్ బాస్’. వెస్ట్రన్ దేశాల్లో సూపర్ హిట్ అయ్యిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇండియాలో కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే మన దగ్గర మాత్రం తెలుగు వెర్షన్ లోనే అన్నిటికంటే పెద్ద హిట్ గా దూసుకెళ్తుంది. ఇలా ఎట్టకేలకి తెలుగులో మొత్తం 9 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం 10వ సీజన్ కి చేరుకుంది.
ఈ సీజన్ ని కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా చేస్తుండగా మేకర్స్ ఎట్టకేలకి ఈ సీజన్ అధికారిక లాంఛ్ డేట్ ని ఇచ్చేసారు. ఈ సెప్టెంబర్ 6,7 తేదీలలో బిగ్ బాస్ 10 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో మొదలు పెట్టనున్నట్టుగా నేడు నాగార్జున పుట్టినరోజు కానుకగా సాలిడ్ ప్రోమో వదిలి ఖరారు చేశారు. ఇక దీనితోనే 10 రెట్లు సర్ప్రైజ్, లు 10 రెట్లు డ్రామా అలాగే 10 రెట్లు ఛాలెంజ్ లు ఉండబోతున్నాయి అని అన్నీ సీజన్ 10 కి తగ్గట్టే పదింతలు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. సో మొత్తానికి బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
