రీజనల్ సినిమా ముందు తేలిపోయిన పాన్ ఇండియా సినిమా.. మాస్ మహారాజ మాస్ కొట్టుడు ఇది

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ‘ఇరుముడి’ సాధించిన సెన్సేషనల్ సక్సెస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత వారంలో విడుదల అయ్యిన ఈ సినిమా పెర్ఫామెన్స్ ముందు ఈ వారంలో విడుదలైన పాన్ ఇండియా భారీ చిత్రం ‘టాక్సిక్’ పెర్ఫామెన్స్ చిన్నబోవడం అనేది ఒకింత ఆసక్తిగా మారింది.

యశ్ నటించిన టాక్సిక్ వల్ల మన తెలుగు స్టేట్స్ లో ఇరుముడి చిత్రానికి ఎఫెక్ట్ పడుతుంది అని మొదటి నుంచీ ఉంది. అయినప్పటికీ థియేటర్స్ తక్కువ ఉన్నా కూడా ఇరుముడి హవా ముందు టాక్సిక్ తేలిపోయింది. బుక్ మై షో టికెట్ బుకింగ్ సేల్స్ లో ఈ వీకెండ్ ఇరుముడి చిత్రం 23 వేల టికెట్స్ పైగా అమ్ముడుపోతుంటే టాక్సిక్ మాత్రం 15 వేలకి పైగా అమ్ముడుపోతుంది.

ఇలా కొత్త వారంలో వచ్చిన సినిమాకంటే గత వారంలో వచ్చిన సినిమాకే నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ కనపడడంతో మాస్ మహారాజ రవితేజ కొట్టుడు మామూలు లెవెల్లో లేదని చెప్పవచ్చు. ఇక ఇదే ట్రెండ్ కొనసాగితే ఇరుముడి మరిన్ని వండర్స్ చేయడం గ్యారెంటీ.

Exit mobile version