The Paradise: కీర్తి సురేష్‌తో నేచురల్ స్టార్ ఊరమాస్ స్టెప్పులు.. ‘యెషనాగుల’ లిరికల్ వీడియో రిలీజ్!

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సరికొత్త డ్యాన్స్ నంబర్ ‘యెషనాగుల’ (#Yeshanagula) విడుదలైంది.

అనిరుధ్ మ్యూజిక్.. నాని-కీర్తి సురేష్ డ్యాన్స్ మేనియా

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పూర్తిస్థాయి హై-ఎనర్జీ బీట్స్‌తో, పవర్‌ఫుల్ రిథమ్‌తో ఈ పాట అదిరిపోయింది. లోకల్ ఫోక్ టచ్‌తో కూడిన లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ అందించగా, ప్రభా బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి తమ గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఈ పాటలో నాని రగ్గడ్ లుక్‌లో కనిపించగా, కీర్తి సురేష్‌తో కలిసి వేసిన మాస్ స్టెప్పులు విజువల్‌గా ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ ఆనంద్ అందించిన షెహనాయ్ బిట్ పాటకు మరింత ఊపు తీసుకొచ్చింది.

ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్ మరియు రస్టిక్ వైబ్స్‌తో విడుదలైన ఈ ‘యెషనాగుల’ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version