సర్దార్ 1 లానే 2 లో కూడా బిగ్ ఇష్యూ!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే సర్దార్ 2. దర్శకుడు పి ఎస్ మిత్రన్ కాంబినేషన్లో చేస్తున్న ఈ సినిమా కోసం కోలీవుడ్ సహా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వస్తున్నాయి. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇందులో సినిమా మెయిన్ పాయింట్ పట్ల ఎక్కువ రివీల్ చేయలేదు. సర్దార్ రోల్ పైనే ఎక్కువ చూపించారు. కానీ లేటెస్ట్ గా సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ పార్ట్ 1 కంటే సర్దార్ పార్ట్ 2 డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తంచేశారు. అలాగే పార్ట్ 1 లో ఎలాగైతే నీటి సమస్యను ప్రధానంగా చూపించారో పార్ట్ 2 లో ఒక పెద్ద సమస్యను చూపించబోతున్నట్టు రివీల్ చేసారు. సో పార్ట్ మరింత ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

Exit mobile version