‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ సాంగ్ రిలీజ్

కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అనే ప్రేమ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

​ఎస్. సుహాస్ స్వరపరిచిన ఈ మెలోడీ పాటకు జగదీష్ సాహిత్యం అందించగా, చైతన్య, లాస్య ఆలపించారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ట్రాక్‌లకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది.

​ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు రాజ్ నోముల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీతో పాటు మిగతా వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version