నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా కావడం, ఈ గ్లింప్స్‌లో బాలయ్యను ‘కింగ్ ఆఫ్ కేయాస్’గా రెట్రో మాస్ అవతార్‌లో చూపించడంతో సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక ఈ గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని పంచుకుంటూ దర్శకుడు త్వరలోనే ఈ మూవీ పాటలు, ట్రైలర్ మరియు మరిన్ని మాస్ అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నామంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ప్రమోషన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, శరత్‌కుమార్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026, డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Thank you all 🙏🏻
The journey is just getting started… let’s take it from here with songs, trailer and a lot more coming your way!! 🤗#DADA pic.twitter.com/0IaS6DnOxS
— Gopichandh Malineni (@megopichand) September 7, 2026
