‘వారణాసి’ ప్లాట్ మొత్తం రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ తో సూపర్ అడ్వెంచర్ రైడ్ గ్యారెంటీ!

Varanasi

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అది కూడా ప్రపంచ ఆడియెన్స్ కూడా ఓ భారతీయ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ సినిమా వారణాసి అని చెప్పాలి. అయితే ఏదైనా తన సినిమా ప్లాట్ ముందే చెప్పి సినిమా చేయడం రాజమౌళి స్పెషాలిటీ..

కొన్నాళ్ల కితమే సినిమా లైన్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు కానీ తాజాగా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ వారణాసి ప్లాట్ మొత్తం చెప్పేసారు. తనకి మొదటి నుంచీ మంచి అడ్వెంచర్ సినిమాలు అంటే చాలా ఇష్టం అని అందుకు తగ్గట్టుగానే తన ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ఇంకా టైం ట్రావెల్ లాంటి పలు అంశాలతో ఉంటుంది అని అంతే కాకుండా వీటితో పాటుగా తండ్రీకొడుకులు నడుమ ఒక అందమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది అని రివీల్ చేశారు.

దీనితో వారణాసి సినిమా పట్ల ఆసక్తి మరింత ఎక్కువైంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న గ్రాండ్ గా ఈ ప్యూర్ ఐమాక్స్ సినిమాని విడుదల చేయబోతున్నారు.

Exit mobile version