‘సూర్య 47’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆయన నటిస్తున్న తన నెక్స్ట్ చిత్రానికి సంబంధించి కూడా అప్పుడే అప్డేట్ ఇచ్చేందుకు సూర్య అండ్ టీమ్ రెడీ అయ్యారు. ‘సూర్య 47’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను సెప్టెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నజ్రియా ఫహాద్, నస్లేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తుండగా జిత్తు మాధవన్ డైరెక్ట్ చేస్తున్నారు.

2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి రాబోయే ఈ స్పెషల్ ఎంట్రీ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మరి సూర్య 47 నుంచి రాబోయే ఈ స్పెషల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version