రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్  – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!

విడుదల తేదీ : సెప్టెంబర్ 11 , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి ఇతరులు
దర్శకత్వం : ఆదిత్య హాసన్
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ & సాయి సౌజన్య
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం : అజీమ్ మహ్మద్
కూర్పు : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బేబి జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సినిమా ‘ఎపిక్’. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తెలంగాణ, వనపర్తికి చెందిన గవర్నమెంట్ టీచర్ చంద్ర శేఖర్ (శివాజీ) తన భార్య శోభారాణి (వాసుకి) ల చిన్న కొడుకు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) సినిమాలు చేస్తాను, దర్శకుడు అవుతాను అని చెప్తుండడం చూసి విసిగిపోయి తెలిసిన వారు చెప్పారని కొడుకుని యూకే పంపించి చదువుతో పాటు ఆర్ధికంగా కూడా సాయంగా ఉంటాడని భావిస్తారు. కొడుకుపై వారు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడకి పంపాక, ఎంతో నెమ్మదస్తుడైన ఆదిత్య లైఫ్ లోకి కడలి (వైష్ణవి చైతన్య) వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? తాను అనుకున్న గోల్ ని రీచ్ అయ్యాడా లేదా? ఆమె అతని లైఫ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? ఆదిత్య తన పర్శనల్ ఆనందాలని ఎంచుకుంటాడా? లేక కుటుంబం కోసం నిలబడతాడా అనేది ఈ సెమిస్టర్ లో అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

దాదాపు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసినవారికి ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సినిమా ఆరంభంలోని కొన్ని నిమిషాల కథనం డీసెంట్ గా చాలా ప్లెజెంట్ గా సాగుతుంది. ఆదిత్య యూకే వెళ్లేంత వరకు ఫ్యామిలీ మూమెంట్స్ తో బాగుంది అనిపిస్తుంది.

అలాగే తన కుటుంబానికి సంబంధించి కనిపించిన సీన్స్ క్లైమాక్స్ లో ఓ ఎమోషనల్ బ్లాక్ బాగున్నాయి. ఇక హీరో ఆనంద్ దేవరకొండ తన రోల్ లో చాలా బాగా చేసాడు. అపరిచితుడు లో రామం రోల్ ని ఇందులో చూసినట్టు అనిపిస్తుంది. ఆ రేంజ్ అమాయకత్వాన్ని ఇన్స్టంట్ ఫన్ ని జెనరేట్ చేస్తూ తాను తన ఇనోసెంట్ పెర్ఫామెన్స్ తో ఆదిత్య అనే పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసాడు.

అలాగే వైష్ణవితో కెమిస్ట్రీ కూడా బాగుంది. అలాగే వైష్ణవి కూడా తన రోల్ లో బాగా చేసింది. పెర్ఫామెన్స్, గ్లామ్ షో బ్యాలన్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఇక శివాజీ, వాసుకిలపై సన్నివేశాలు ఈ చిత్రంలో మరో బలం అని చెప్పొచ్చు. వారిపై వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హేశం అబ్దుల్ వాహాబ్ సంగీతం, పాటలు కూడా ఇందులో ప్లస్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఓకే కానీ అసలు లీడ్ జంట నడిచే సన్నివేశాలు ఆ కథనమే ఇబ్బందికరంగా ఒక క్లారిటీ లేకుండా చాలా రొటీన్ గా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అసలు దర్శకుడు ఆ ఇద్దరితో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేది ఎంతకీ అర్ధం కాదు.

అలా క్లైమాక్స్ కి వచ్చే సరికి, అప్పటికే అందరికీ వచ్చే డౌట్ కే క్లారిటీ ఇస్తాడు. కానీ మధ్యలో ఇంత సాగదీత అవసరమా అని అనిపించక మానదు. ఇలా వీరి ట్రాక్ లో బలం లోపించినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

నిర్మాణ విలువలు ఇందులో బాగున్నాయి. మేకర్స్ పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. యూకే లో మంచి లొకేషన్స్ ని కెమెరా మెన్ బంధించి డీసెంట్ దృశ్యాలతో సినిమా చూపించారు. హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం, స్కోర్ సినిమాలో చాలా వరకు సేవ్ చేసాయి. నవీన్ నూలి ఎడిటింగ్ లో ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు ఆదిత్య హాసన్ విషయానికి వస్తే.. తాను చెప్పాలనుకున్న పాయింట్ లో కొన్ని ఎమోషన్స్ ని డీసెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. అలాగే కొన్ని డెప్త్ సీన్స్ బాగున్నాయి. అయితే రాసుకున్న లీడ్ పాత్రల్లో కూడా కొంచెం బెటర్మెంట్ కనిపిస్తే బాగుణ్ణు. ఇది పక్కన పెడితే తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఎపిక్’ లో అక్కడక్కడా మూమెంట్స్ బాగున్నాయి. కొన్ని ఫ్యామిలీ సీన్స్ లో ఎమోషన్స్, అలాగే ఫన్ సీన్స్ బాగున్నాయి. లీడ్ జంట కూడా ఇందులో బాగా చేశారు. కానీ కథనం ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సో దీనితో అక్కడక్కడా సినిమా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here English Review

Exit mobile version