‘ఇండియన్ 3’పై మళ్లీ ఆశలు.. ఈసారైనా అయ్యేనా..?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్ 2’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆగిపోయిన ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. సీక్వెల్ ఫలితంతో మూడో భాగాన్ని పక్కన పెట్టినప్పటికీ, చెన్నై వర్గాల సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఇండియన్ 2’తో పాటు మూడో భాగానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కేవలం కొంత ప్యాచ్ వర్క్ మరియు సిజి పనులు మాత్రమే బాకీ ఉండటంతో, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ ఫలితంతో కాస్త వెనుకబడ్డ శంకర్‌కి, ఈ ఫ్రాంచైజీకి ఈ సినిమా చాలా కీలకం కానుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version