ప్రముఖ నటి సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో తనకోసం ఘనంగా నిర్వహించిన సంప్రదాయ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఈ వేడుకలో మంగళస్నానంతో పాటు సాంప్రదాయ పద్ధతి లో సీమంతం నిర్వహించారు.
ఈ వేడుకలో సమంత కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులతో పాటు ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా పాల్గొన్నారు. “ఈ ఆచారంలో ఒక తల్లిని చూసే విధానం నన్ను ఎంతగానో కదిలించింది” అంటూ సమంత తన ఎమోషన్స్ ని పంచుకుంది. గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, ఈ ఏడాది జూన్లో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
