పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల వాయిదా పడుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, అది దాదాపు అసాధ్యమని తేలింది. చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కొంత ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్‌లో ఉంది.
దీనికి మరో 50 నుంచి 60 రోజుల షూటింగ్ డేస్ అవసరమవ్వడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మిగిలి ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 3 రేసు నుండి తప్పుకోవడంతో దర్శకనిర్మాతలు కాస్త టైమ్ తీసుకుని మిగిలిన షూటింగ్‌ను పక్కాగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 26న సినిమాను విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
సమ్మర్‌లో ఎలాగూ ప్రభాస్ ‘స్పిరిట్’ లైన్‌లో ఉండటంతో, రెండు సినిమాల మధ్య సరైన గ్యాప్ ఉండేలా చూసుకోవాల్సి ఉంది. అయితే ఈసారి రిలీజ్ డేట్ ప్రకటిస్తే మళ్లీ మారకూడదనే ఉద్దేశంతో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త తేదీని ప్రకటించే విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారట.
