జైలర్ 2 : అప్డేట్స్‌తో ట్రీట్ ఇచ్చేందుకు తలైవా సిద్ధం..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్స్‌కు సమయం ఆసన్నమైందని.. ఈ సినిమాకు సంబంధించిన వరుస బిగ్ అప్‌డేట్స్‌ను రేపటి(సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రేపటి నుంచి రాబోయే వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version