‘రణబాలి’ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామానే రణబాలి. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు అవైటెడ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే గత కొన్ని నెలలు కితం విజయ్, రష్మిక పెళ్లి కానుకగా ఏందయ్యా సామి అంటూ సాగే సాంగ్ బిట్ ని వదిలితే అది పెద్ద హిట్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ విడుదలకి డేట్ ని మేకర్స్ ఖాయం చేశారు. ఈ అవైటెడ్ సాంగ్ ఈ సెప్టెంబర్ 21న మొత్తం పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసారు.

సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అజయ్ అతుల్ లు సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అక్టోబర్ 16న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Exit mobile version