పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, లేటెస్ట్ కథనాల ప్రకారం, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేశారట. ఈ సాంగ్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని, ఈ లుక్ ను లాక్ చేశారని, కచ్చితంగా ఈ సాంగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది. పైగా ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది.
మరి ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. కాగా ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
