ఓటీటీ :- అగధ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ !

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న భారీగా విడుదల అయింది. ఐతే, ప్రమోషన్స్ లో కలిగించిన అంచనాలకు తగ్గట్లుగా.. సినిమా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. జీ5 దీని డిజిటల్ ప్రీమియర్ తేదీని సెప్టెంబర్ 25, 2026గా ఖరారు చేసింది.

మరి ఓటీటీలో అయినా ఈ సినిమాకి విజయం దక్కుతుందేమో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో జోవికా విజయ్‌కుమార్, షిజు, రోషన్ బషీర్ మరియు శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం మరియు పాటలను సమకూర్చారు. ఇక ‘అగధ’ అంటే లోతైన అంశం లేదా శూన్యం అని అర్థం. కంటికి కనిపించని దేవుడు, దెయ్యం లాంటి శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్ట శక్తినే ‘అగధ’గా చూపించారు.

Exit mobile version