సమీక్ష : ‘ది ప్యారడైజ్’ – యాక్షన్ మెప్పిస్తుంది.. డ్రామా నిరాశపరుస్తుంది!

విడుదల తేదీ : సెప్టెంబర్ 24 , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నాని, మోహన్ బాబు, బరగి విక్రమ్ రెడ్డి, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, కయదు లోహర్ తదితరులు.
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
సంగీతం : అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం : సిహెచ్ సాయి
కూర్పు : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :-

1980ల నాటి ప్యారడైజ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అణగారిన తమ జాతి హక్కుల కోసం, గుర్తింపు కోసం సమ్మక్క (సోనాలీ కులకర్ణి) అందరితో కలిసి పోరాడుతూ ఉంటుంది. అయితే, వారి జాతిని నాశనం చేస్తూ వస్తున్న మాలిక్ (మోహన్ బాబు) ముందు వాళ్ళంతా ఏం చేయలేకపోతారు. ఇలాంటి నేపథ్యంలో సమ్మక్కకి ఒక కొడుకు పుడతాడు. అతనే జడల్ (నాని). తన జాతి కోసం అతను ఏం చేశాడు ?, అసలు తన తల్లి పై అతను ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?, సమ్మక్క ఎలాంటి తప్పు చేసింది ?, దేని కోసం చేసింది ?, చివరకి తల్లి–కొడుకుల అనుబంధం కథలో ఎలాంటి మలుపు తిప్పింది ?, తమ గుర్తింపు కోసం, తమ హక్కులు కోసం జడల్ మొత్తం వ్యవస్థను ఎలా ఎదిరించాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడు. నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. పైగా ఈ సినిమా భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో నాని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. ఆయన పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. నాని పాత్రకు దీటుగా ఆయన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన బరగి విక్రమ్ రెడ్డి, రాఘవ్ జుయల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. మరో కీలకమైన పాత్రలో కనిపించిన ప్రియదర్శి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్’ రొటీన్ గా సాగుతూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హీరో – విలన్ ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. అలాగే, ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేదు.

ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో శ్రీకాంత్ కొన్ని చోట్ల విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా సినిమా మొత్తాన్ని రెగ్యులర్ ప్లేతోనే నడిపాడు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. దీనికితోడు తను నమ్మిన ఎమోషనల్ డ్రామా.. బోరింగ్ గా సాగడం కూడా సినిమాకి మైనస్ అయింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ జికె విష్ణు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శ్రీకాంత్ ఓదెల రచయితగా ఆకట్టుకోలేదు. కానీ, దర్శకుడిగా ఈ చిత్రానికి న్యాయం చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

‘ది ప్యారడైజ్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో.. నాని నటన, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ హెవీ ఎమోషన్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మరియు నాని అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Exit mobile version