‘టాక్సిక్’ని క్రాస్ చేసిన ‘హనుమాన్ అన్శ్’.. అక్కడ మరో మైల్ స్టోన్!

ఇటీవల బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన ఒక సర్ప్రైజింగ్ హిట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన భక్తి చిత్రం ‘హనుమాన్ అన్శ్’ అని చెప్పాలి. ఎటువంటి అంచనాలు నెలకుండా వచ్చి సంచలన రన్ ని చూసిన ఈ సినిమా రికార్డులు సెట్ చేసింది.

అయితే ఇప్పటికీ సాలిడ్ లాంగ్ రన్ ని కొనసాగుతున్న ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన టాక్సిక్ లాంగ్ రన్ వసూళ్లు కూడా దాటేసి దుమ్ము లేపింది. అయితే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ‘హనుమాన్ అన్శ్’ సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తుంది.

నార్త్ అమెరికాలో తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్కును దాటి మరో మైల్ స్టోన్ అందుకొని అక్కడ కూడా స్లో అవ్వడానికి నో కాంప్రమైజ్ అంటుంది. ఇదంతా కేవలం ఒక్క హిందీ వెర్షన్ లోనే కావడం గమనార్హం. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాల్సిందే.

Exit mobile version