న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌ను సాధించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా, వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది.
ముఖ్యంగా నాని ఫేవరెట్ మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో ఈ సినిమా తన ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా 1.42 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. ఇది ఈ ఏడాదికి సంబంధించి రెండో అతిపెద్ద ప్రీమియర్ వసూలు గా నిలిచింది. టాక్ బాగుండి ఉంటే ‘పెద్ది’ రికార్డును దాటి ఈ ఏడాది బిగ్గెస్ట్ ప్రీమియర్ రికార్డు సాధించి ఉండేదని, అయితే డివైడ్ టాక్ వల్ల కొద్దిలో ఆ మార్కును మిస్ అయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయినప్పటికీ, ఓవర్సీస్ ప్రేక్షకుల్లో నానికి ఉన్న తిరుగులేని క్రేజ్ కారణంగానే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. అంతేకాకుండా నాని కెరీర్‌లోనే నార్త్ అమెరికాలో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ సాధించిన చిత్రంగా ‘ది ప్యారడైజ్’ కొత్త రికార్డు నెలకొల్పింది. మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మున్ముందు రోజుల్లో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
