నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విప్లవాత్మక డ్రామా ది ప్యారడైజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ డే 1 బుకింగ్స్ మాత్రం ఇంత కూడా చెక్కు చెదరలేదు. దీనితో ప్యారడైజ్ డే 1 వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ట్రేడ్ సర్కిల్స్ లో చర్చగా మారింది.
అయితే కేవలం నాని అభిమానులు మాత్రమే కాకుండా మిగతా హీరోల అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. నాని టైర్ 1 హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ సాధించాడా లేదా అనేది రివీల్ కావాల్సి ఉంది. సో మేకర్స్ వేసే అఫీషియల్ నెంబర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. దీనితో చాలామంది ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
