నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన రెండో సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ అందుకొని సంచలనం సెట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాదికి ఆల్ టైం రికార్డు ఓపెనర్ గా తెలుగు నుంచి నిలిచిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంది.
మొదటి రోజే 13 కోట్లకి పైగా ఓపెనింగ్స్ ప్రీమియర్స్ తో కలిపి షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అక్కడ వర్కింగ్ డే పైగా గణేష్ నిమర్జనం లాంటి బిగ్ డే అయినప్పటికీ సాలిడ్ నంబర్స్ రాబట్టి అదరగొట్టింది. పి ఆర్ నంబర్స్ ప్రకారం ప్యారడైజ్ రెండో రోజు 5 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. దీనితో మొత్తం 18 కోట్లకి పైగా షేర్ మార్కుని ఈ సినిమా టచ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ శని, ఆదివారం వసూళ్లు కూడా బాగానే నమోదు అవుతాయని చెప్పొచ్చు. మరి ఈ రెండు రోజుల పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
