‘దర్శకుడు క్రిష్ జాగర్లమూడి’ పూర్తిగా కొత్త నటీనటులతో జెంజ్ బ్యాచ్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో క్రిష్ పూర్తిగా సంతృప్తిగా లేరని, కొత్త నటీనటుల నుంచి అనుకున్న స్థాయిలో ఎమోషన్స్ పండలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే, సినిమాని ట్రిమ్ చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నారట. ముఖ్యంగా కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉండేలా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాలని క్రిష్ భావిస్తున్నారట.
ఆ మధ్య ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను మళ్ళీ రీషూట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. మొత్తానికి అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని క్రిష్ ఫిక్స్ అయ్యాడట. అన్నట్టు ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోల కంటే కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
