ఓటీటీలో టేకోవర్ చేసిన మైత్రి వారి సినిమాలు..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన భారీ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమా ఇరుముడి అనే చెప్పాలి. 100 కోట్లకి పైగా లాభాలు అందించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీ లోకి వచ్చింది.

ఇక ఇదే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ నుంచి రీసెంట్ గానే వచ్చిన కోలీవుడ్ సినిమా ‘మొద రాత్రి’ కూడా ఒకటి. కోలీవుడ్ లో డీసెంట్ రన్ అందుకున్న ఈ సినిమా కూడా ఇరుముడి తర్వాత అదే ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీలో అదరగొడుతున్నాయి.

ఇరుముడి ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంటే మొద రాత్రి మాత్రం టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. ఇలా టాప్ రెండు సినిమాలు మైత్రి మూవీ వాళ్ళవే ఉండడం విశేషం. ఇక ఇరుముడి సినిమాని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించగా మొద రాత్రి ని దర్శకుడు రాజా కరుప్పుసామి తెరకెక్కించారు.

Exit mobile version