ఏప్రిల్ 18నుండి షూటింగ్ జరుపుకోనున్న గోపీచంద్ సినిమా

ఏప్రిల్ 18నుండి షూటింగ్ జరుపుకోనున్న గోపీచంద్ సినిమా

Published on Apr 12, 2014 1:00 AM IST

Gopichand
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించనున్న సినిమా ఈనెల 18నుండి షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ హీరోయిన్. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా లాంచనంగా ప్రారంభమయ్యింది

ఈ సినిమా విశేషాలను హీరో తెలుపుతూ “స్క్రిప్ట్ వినగానే నచ్చేసే తరుణాలు అతికొద్దిగా వుంటాయి. శ్రీధర్, శ్రీవాస్ కూర్చిన స్క్రిప్ట్ నాకు చాలానచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది” అని తెలిపారు. ఈ చిత్రం ఒక నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అని తన గత సినిమాలకంటే మెరుగ్గా వుంటుందని బ్రహ్మానందం పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపాడు

గోపీ మోహన్, కోనా వెంకట్ స్క్రీన్ ప్లే భాద్యతలు చేపట్టారు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. నాలుగునెలలో సినిమా షూటింగ్ ని ముగించే ప్రణాళికలో వున్నారు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు