ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో శర్వానంద్ మేకోవర్ మరియు ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రంగా రూపొందించాడు. మాళవిక నాయర్, రాజశేఖర్ వంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌తో పాటు జిబ్రాన్ అందించిన బీజీఎం రేసింగ్ సీన్స్‌కు ప్రాణం పోశాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాయి.
ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. మే 1, 2026 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మంచి స్పీడ్ చూపెట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.



