
ప్రస్తుతం టాలీవుడ్, రాజకీయాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తరపున ప్రచారం చేయనున్నాడు. ఈ రోజే బిజెపి ప్రధాన అభ్యర్థి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ పార్టీకి ప్రచారం చేయమని అలాగే కర్ణాటకలో కూడా ప్రచారానికి రావాలని పిలుపునిచ్చారు.
కానీ ఈ వార్తలని పవన్ కళ్యాణ్ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఇది కాకుండా పవన్ రవిజయవాడ, అనంతపూర్ లలో రెండు బహిరంగ సభలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి ప్రచారం చేస్తే బిజెపి కి ఏమన్నా హెల్ప్ అవుతుందా? అనే దాని కోసం వేచి చూడాల్సిందే..

