‘పెద్ది’ విషయంలో ఇదే జరిగింది ?

‘పెద్ది’ విషయంలో ఇదే జరిగింది ?

Published on Apr 27, 2026 11:01 AM IST

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ముందుగా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఆ తర్వాత ఈ సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని చూశారు. అది కుదరలేదు. ఫైనల్ గా జూన్ 25వ తేదీని లాక్ చేశారు. అసలు ‘పెద్ది’ రిలీజ్ ఆలస్యం కావడానికి ముఖ్య కారణం.. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది.

చరణ్ పాత్ర తాలూకు గెటప్ అండ్ సెటప్ కి సీజీ పనులు ఇంకా పూర్తి కాలేదట. పీరియాడిక్ నేపథ్యం కాబట్టి.. అప్పటి కాలానికి అనుగుణంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను చెక్కుతున్నారు. అందుకే.. విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి జూన్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు