హిందీ లో నిర్మింపబడనున్న ‘అలా మొదలైంది’

హిందీ లో నిర్మింపబడనున్న ‘అలా మొదలైంది’

Published on Apr 14, 2014 11:34 PM IST

Ala-Modalaindi
దర్శకురాలు నందిని రెడ్డి తన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ తో తెలుగు ఇండస్ట్రీ లో మంచి ముద్ర వేసారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు మంచి బిజినెస్ కూడా సాధించింది . తాజా సమాచారం నిజమైతే ఈ చిత్రం రిలీజ్ అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు హిందీ లో నిర్మించబడనుంది.
ప్రస్తుతం నందిని రెడ్డి కి కొన్ని హిందీ నిర్మాణ సంస్థలకి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రం లో కొత్త నటీనటులు కనబడవచ్చు. అంత అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్ధం లో ప్రారంభంకానుంది.
నందిని రెడ్డి రెండో చిత్రం ‘జబర్దస్త్’ బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టగా ఈ హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లో ముద్ర వేయాలనుకుంటుంది.

తాజా వార్తలు