ఆచితూచి అడుగేయనున్న నాని

ఆచితూచి అడుగేయనున్న నాని

Published on Apr 15, 2014 2:32 AM IST

nani
నాని ప్రస్తుతం తన కెరీర్ లో క్లిష్ట పరిస్థితుల్లో వున్నాడు. వరుస పెట్టి రెండు పరాజయాలు నానిని బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడేలా చేసింది. ఒకానొక సమయంలో మినిమం గ్యారంటీ హీరోగా నిలిచిన ఈ నటుడ్ని ఇప్పుడు మినిమం పట్టించుకునేవారే కరువయ్యారు

ఇవన్నీ ఇప్పుడు నానిని తన కెరీర్ గురించి ఆలోచించుకునేలా చేసాయి. ఒక తమిళ సినిమా హక్కులు తీసుకున్నా ఇప్పటివరకూ ఆ సినిమా గురించి ఏ విషయం బయటకు రాలేదు. ఇంకా మంచి కధలపై నాని ఆసక్తి కనబరుస్తున్నాడు అని వినికిడి

నాని చాలా జాగ్రత్తగా కెరీర్ ని బిల్డ్ చేసుకుని ఒకటో రెండో హిట్లను అందుకునే తిరిగి ఫాం ని సంపాదించగలడు. ఇప్పుడు నానికి మరో పరాజయం ఎదురైతే దానిని ఎదుర్కుని నిలదొక్కుకోవడం కష్టమనే చెప్పాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని ఆశిద్దాం

తాజా వార్తలు