
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన ఫ్యామిలీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో ఎన్.టి.ఆర్ తో పాటు సినిమాలో నటిస్తున్న ప్రధాన నటీనటులంతా పాల్గొంటున్నారు. ఈ చిత్ర షెడ్యూల్ మరో 10 రోజుల పాటు హైదరాబాద్లోనే కొనసాగనుంది.
ఎన్.టి.ఆర్ అభిమానులు ఆశించే యాక్షన్, డాన్సులు, కామెడీతో పాటే చక్కని కుటుంబ విలువలు కూడా ఈ సినిమాలో ఉండేలా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కేర్ తీసుకుంటున్నాడు. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

