రామ్ చరణ్ సినిమాకి మారిన మ్యూజిక్ డైరెక్టర్

రామ్ చరణ్ సినిమాకి మారిన మ్యూజిక్ డైరెక్టర్

Published on Apr 15, 2014 3:44 PM IST

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదట అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మారిపోయాడు. సినిమా మొదలైనప్పుడు ఎస్ఎస్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు తమన్ ప్లేస్ లో యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ డైరెక్టర్ గా రీ ప్లేస్ చేసారు. యువన్ శంకర్ రాజా గతంలో తెలుగులో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శ్రీ కాంత్, రాజ్ కిరణ్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు