వరుస తమిళ ఆఫర్లతో బిజీ అవుతున్న సమంత

వరుస తమిళ ఆఫర్లతో బిజీ అవుతున్న సమంత

Published on Apr 16, 2014 12:07 PM IST

Samantha1
టాలీవుడ్ గ్లామర్ డాల్, తెలుగు ప్రేక్షకుల కళల రాణి ప్రస్తుతం తమిళంలో వరుసగా క్రేజీ ఆఫర్స్ తెచ్చుకుంటోంది. తమిళ భామ అయిన సమంత గౌతం మీనన్ తీసిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టాప్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా గడిపిన సమంత ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరోలైన విజయ్, సూర్య సరసన సినిమాలు చేస్తున్న ఈ భామ తాజాగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్న సినిమాకి సైన్ చేసింది. గతంలో కూడా సమంత విక్రమ్ సరసన ‘ఐ’ సినిమాలో నటించాల్సింది కానీ అప్పుడు ఆరోగ్యం బాగా లేనందు వల్ల ఆ అవకాశం అమీ జాక్సన్ కొట్టేసింది.

సమంత ప్రస్తుతం తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’, వివి వినాయక్ సినిమాలో నటిస్తోంది, అది కాకుండా అక్కినేని ఫ్యామిలీ ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ త్వరలో రిలీజ్ కానున్నాయి.

తాజా వార్తలు